![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu )'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-446లో.. ప్రేమ ఒంటరిగా నిల్చుంటే ధీరజ్ తన వెనకాలకి వెళ్ళి హగ్ చేసుకొని మాట్లాడతాడు. ఎందుకు ప్రేమ ఇలా చేశావ్.. నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు నేను ఎంత అవమానిస్తున్నా భరించావని ధీరజ్ అడుగుతాడు. అందరు నన్ను నమ్మకపోయినా.. నువ్వు నమ్ముతావనుకున్నా కానీ నువ్వే నమ్మకపోతే నేనేం చేయాలని ప్రేమ అంటుంది. నా చెల్లెలి కాపురం నాశనం చేయడానికి మీ అన్నతో కలిసి ఇలా చేశావేమోననే ఆలోచన.. నువ్వు చెప్పేది వినిపించుకోకుండా చేసింది.. నన్ను క్షమించు ప్రేమ.. అయినా వినకపోతే నన్ను కొట్టి మరీ చెప్పాలి.. ఇంకెప్పుడు నిన్ను అపార్థం చేసుకోను ప్రేమ అని ధీరజ్ అంటాడు. ఆ తర్వాత ఇద్దరు హ్యాపీగా ఉంటారు.
మరోవైపు సాగర్ ఇంట్లో వాళ్ళందరికి కొత్త బట్టలు తీసుకొని వస్తాడు. ఏంట్రా పెద్దోడా.. ఇంత హ్యాపీగా ఉన్నావని తిరుపతి అడుగుతాడు. నా ఫస్ట్ సాలరీ పడింది అందుకే అందరికి బట్టలు తీసుకొని వచ్చానని సాగర్ అంటాడు. ఆ తర్వాత అందరికి బట్టలు ఇస్తాడు సాగర్. నాన్న ఎక్కడున్నాడని సాగర్ అడుగుతాడు. ఇక బయట గార్డెన్ లో ఉన్న రామరాజు దగ్గరికి సాగర్ వచ్చి తను తీసుకొచ్చిన కొత్త బట్టలు ఇస్తాడు. కానీ రామారాజు సైలెంట్ గా ఉంటాడు. నాన్న పాత విషయాలు అన్నీ మర్చిపోయి తీసుకోండి అని సాగర్ మళ్ళీ అంటాడు. వెంటనే ఆ బట్టలు తీసుకొని నేలపై విసిరేస్తాడు. ఏం అయిందని అడుగుతాడు సాగర్. నువ్వు మీ ఆవిడ నగలు తాకట్టు పెట్టిన సేట్ నా దగ్గరికి వచ్చాడు. మీ కొడుకు నా అప్పు తీర్చేలా లేడు.. మీరే ఇవ్వాలని అందరి ముందు ఆ సేట్ నన్ను అడిగాడు.. నా పరువుపోయిందని రామరాజు కోప్పడతాడు.
ఆ డబ్బులు నేను ఎలాగోలా కడతాను నాన్న అని సాగర్ అంటాడు. నువ్వు అక్రమంగా సంపాదించి తెచ్చిన ఈ బట్టలు నేను చూసినప్పుడల్లా నాకు అదే గుర్తొస్తుందని రామరాజు అంటాడు. అసలు ఇరవై లక్షలు.. నెల నెల వడ్డీ ఎలా కడతావ్ ఆ సేట్ కి అని రామరాజు అడుగుతాడు.. నేను ఎలాగైనా కడతాను.. అది వదిలేయండి అని సాగర్ అంటాడు. ఎలాగైనా అంటే మళ్ళీ నన్ను మోసం చేసి డబ్బు దొంగతనం చేస్తావా అని రామరాజు అంటాడు. అది మర్చిపోయి.. ఈ బట్టలు తీసుకోండి అని సాగర్ అంటాడు. ఇక పట్టరాని కోపంతో ఉన్న రామరాజు.. అందరికి ఇచ్చిన బట్టలు విసిరేసి వాటి మీద కిరోసిన్ పోసి తగలెట్టేస్తాడు. ఆ తర్వాత రామరాజు లోపలికి వెళ్తాడు. ఎక్కడివాళ్ళు అక్కడ లోపలికి వెళ్తారు. ఇక సాగర్ లోపలికి వెళ్ళి బట్టలు సర్దుకుంటాడు. అప్పుడే నర్మద వస్తుంది. ఏంటి సాగర్ ఎక్కడికి అని నర్మద అడుగగా.. అతను మారడు.. కొడుకలని అర్థం చేసుకోవడం అతనికి రాదు.. నేను ఉండను.. నువ్వు నాతో వస్తావా రావా అని సాగర్ అంటాడు. భర్త ఎక్కడుంటే భార్య అక్కడే ఉండాలి కాబట్టి వస్తాను కానీ నువ్వు నాకు ఒక మాటివ్వాలి.. నేను చెప్పింది చేస్తే వస్తానని నర్మద అంటుంది. ఏంటని అడుగగా నువ్వు ఆ జాబ్ మానెయ్యమని నర్మద అంటుంది. ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్ననావా అని సాగర్ అనగానే లేదు.. మీ ఆయన మోసం చేసి లంచం ఇచ్చి జాబ్ తెచ్చుకున్నాడని నా కొలోగ్స్ అంటుంటే నా పరువు పోతుంది.. వాళ్ళ మాటలు వినలేకపోతున్నాని నర్మద అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |